ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeక్రైమ్భర్త చేతిలో నిండు గర్భిణీ అయిన భార్య హత్య.

భర్త చేతిలో నిండు గర్భిణీ అయిన భార్య హత్య.

📰 Generate e-Paper Clip

మధురవాడ, జయ జయహే: న్యూస్:మధురవాడ లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిండుగర్భిణీ అని కూడా చూడకుండా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాల్ని మృతురాలి కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. జీవిఎంసీ 7 వార్డు పరిధిలో ఆర్టీసీ కాలనీలో ఒక అపార్ట్ మెంట్ (శ్రీ లలిత విహార )303 ప్లాట్ లో గత కొంత కాలంగా కేదారశెట్టి అనూష,భర్త గెద్దాడ జ్ఞానేశ్వరావు భార్యభర్తలు నివాసoటున్నారు. వీరికి 2022లో వివాహం జరగ్గా, ప్రస్తుతం అనూష గర్భిణి. ఆమె స్వగ్రామం నర్సీపట్నం అడ్డు రోడ్డు ప్రాంతం. గాజువాకలోని సెక్టార్-2 ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వరావు కొన్నాళ్ల క్రితం అనూషను మధురవాడ ప్రాంతానికి తీసుకు వచ్చి కాపురం పెట్టాడు. అయితే కొన్నాళ్లగా భార్యభర్తల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. సోమవారం కూడా గొడవ జరగ్గా, జ్ఞానేశ్వరరావు అనూషపై దాడి చేశాడని, తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికుల సహాయంతో కేజీహెచ్ కు తరలించగా, అక్కడ మృతి చెందిందని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పీ.ఎం.పాలెం సీఐ బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు. జ్ఞానేశ్వర్ ను కఠినంగా శిక్షించాలని , మరో అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లతో వేడుకుంటున్న అనూష తల్లి స్నేహితులు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!