ePaper
Saturday, June 6, 2026
ePaper

📰 Generate e-Paper Clip

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

సిరివెళ్ల, శివసూర్య

08.06.2025 వ తేదీన సాయంత్రము సుమారు 4.45 PM గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి వయసు సుమారు 65 సంవత్సరాల నుండి 70 సం వయసున్న వ్యక్తి ఎర్రగుంట్ల గ్రామము విమల స్కూల్ దాటిన తర్వాత  రోడ్డును దాటుతున్న సమయంలో అతన్ని  MH 46CU 3203 అనే గూడ్స్ క్యారియర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతి చెందిన వ్యక్తికి వయసు సుమారు 65 నుండి 70 సంవత్సరాలుగా అంచనా వేయబడుతోంది. మృతుని వంటి పై తెల్లటి చొక్కా , తెల్లటి పంచ టవల్ వేసుకొని ఉన్నాడు

ఈ మృతదేహాము గురించి ఎవరికైనా సమాచారం  తెలిసి ఉంటే, దయచేసి సిరివెళ్ల పోలీసులకు , SI/CI గారికి సమాచారం అందించగలరు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
SI: 9121101170
CI: 9121101169

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!