ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeఆరోగ్యంకిల్కారితో గర్భిణీలకు ఎంతో ఉపకారం : డిపిహెచ్ఎన్ఓ

కిల్కారితో గర్భిణీలకు ఎంతో ఉపకారం : డిపిహెచ్ఎన్ఓ

📰 Generate e-Paper Clip

అరకు జిల్లా : జయజయహే : కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలు అమలు చేస్తున్న అక్కడక్కడ ఇంక వివిధ కారణాలతో మాత శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయని డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ సూపర్వైజర్ ధనలక్ష్మి అన్నారు. అరకులోయ మండలంలోని మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాడగడ ఆసుపత్రి వైద్యుడు ఉదయ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.జిల్లాలో మాతా శిశు మరణాలు నివారణకు అడ్డుకట్ట వేయాలంటే గర్భిణులుగా నమోదైన దగ్గర నుంచి ప్రసవం అయ్యే వరకు వారికి సేవలు అందించాలని ఆశా కార్యకర్తలకు ఏఎన్ఏంలకు ఎమ్.ఏల్.హెచ్.పిలకు సూచించారు.దీనిలోనే భాగంగా గర్భిణీలు బాలింతలకు ఆరోగ్య సమాచారాన్ని చేరవేసేందుకు కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించాలన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిల్కారి ఆడియో కార్యక్రమం ద్వారా గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆహారా నియమాలు వైద్య పరీక్షలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా కిల్కారి ఆడియో వినిపించాలని సూచించారు.గర్భిణీలను ఆప్యాయంగా పలకరించడంతోపాటు ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహారం వైద్యం ఇలా అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.వారానికి ఆడియో చొప్పున 72 వారాలపాటు వాయిస్ రూపంలో సమాచారం ఇవ్వాలన్నారు.కిల్కారి విధానంపై పీహెచ్సిలా వారిగా క్షేత్రస్థాయిలో సేవలు అందించే ఏఎన్ఎంలు అశా కార్యకర్తలకు కిల్కారి ఎంతో ఉపకారి అన్నారు.గర్భిణిగా నమోదైన నాలుగో నెల నుంచి ఏడాది వరకు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఉదయ్ ప్రశాంత్ సూపర్వైజర్లు కుమారి ముత్యాలమ్మ భద్రయ్య హెల్త్ అసిస్టెంట్లు చిన్న రమణ నీలంబట్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!