ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeఅభివృద్దిప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజు

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజు

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే: ప్రజా సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి చేస్తున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో వార్డులోని పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.34వ వార్డు కొబ్బరి తోటలో నవ వధువు యమునకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకుమలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 32వ వార్డుతో పాటు నియోజకవర్గంలోని సుమారుగా అన్ని వార్డుల ప్రజల విన్నపం మేరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపిస్తున్నట్లు వెల్లడించారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలో గల తన పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి పలు వార్డుల నుంచి ఎంతోమంది వస్తున్నారని చెప్పారు.ప్రజల సమస్యలను విని, మరిన్ని వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకుని, సాధ్యమైనంత మేర వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్పోరేటర్ డా.కందుల నాగరాజు ను నేరుగా కలిసిన వారిని మాత్రమే కాకుండా తనను ఫోన్లో సంప్రదించిన వారికి కూడా వారి సమస్యలను సావధానంగా విని వారికి సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని, ఈ ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి రావు , గణేష్ ,వెంకట రావు , గురుమూర్తి ,నీలం రాజు ,నరేష్, కందుల కృష్ణ , రమేష్ పాడి , సీపీఐ బుజ్జి ,అప్పారావు ,జానకి ,భారతి , కుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!