కిల్కారితో గర్భిణీలకు ఎంతో ఉపకారం : డిపిహెచ్ఎన్ఓ
అరకు జిల్లా : జయజయహే : కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలు అమలు చేస్తున్న అక్కడక్కడ ఇంక వివిధ కారణాలతో మాత శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయని డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ సూపర్వైజర్ ధనలక్ష్మి అన్నారు. అరకులోయ మండలంలోని మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాడగడ ఆసుపత్రి వైద్యుడు ఉదయ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.జిల్లాలో మాతా శిశు మరణాలు నివారణకు అడ్డుకట్ట వేయాలంటే గర్భిణులుగా నమోదైన దగ్గర నుంచి ప్రసవం అయ్యే వరకు...