ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeవిద్య సమాచారంకంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలకు విశేష స్పందన

కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలకు విశేష స్పందన

📰 Generate e-Paper Clip

శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు పూజ్య శంకర విజయేంద్రసరస్వతీ శంకరాచార్య స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి విశ్వ మహావిద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ) కంచి, తమిళనాడు, సాంప్రదాయ పాఠశాల, శ్రీ శంకర సంస్కృతి పాఠశాల, శ్రీ శంకర సరస్వతి పాఠశాల, శాస్త్రసరణి పాఠశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల, శ్రీకంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యాసంస్థలలో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల 21 వ తేదీన విశాఖపట్నం శంకరమఠంలో స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించబడింది. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్, డీన్ కె. వెంకటరమణ, ఆలూరి కెంపనాథ్ (డైరెక్టర్- శంకర సంస్కృతి పాఠశాల) కార్యక్రమాన్ని ఉద్దేశించి శంకరమఠంలో మాట్లాడుతూ… అతితక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందచేస్తున్న ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న స్పాట్ అడ్మిషన్ లను అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఆయా విద్యాసంస్థల్లో ఆరవతరగతి నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హాస్టల్ వసతి కూడా ఉందని, విద్యానంతరం ప్లేస్ మెంట్ సదుపాయం కూడా లభిస్తుందన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎమ్ఈసీ, సీఈసీ విద్యార్థులకు జేఈఈ, నీట్, సీఏ, ఫౌండేషన్, క్లాట్ ప్రత్యేక పరీక్షల కోసం శిక్షణ కూడా లభిస్తుందన్నారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. సనాతనధర్మంలో పొందుపరచబడిన సాంప్రదాయ విలువలతో కూడిన శ్రేష్ఠమైన విద్యను విద్యార్థులకు అందించడమే శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ డా.‌ దండిభొట్ల నాగేశ్వరరావు మరియు డా.‌ కోటేశ్వరరావు తదితరులు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. విశాఖపట్నం శంకరమఠం కార్యనిర్వాహకవర్గం అధ్యక్షులు టి. రవిరాజు కార్యదర్శి తల్లాప్రగడ అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సదరు కౌన్సిలింగ్ కార్యక్రమం రేపు అనగా 22.04.2025 తేదీన విజయనగరంలో ది సన్ స్కూల్ ప్రాంగణంలోనూ మరియు శ్రీకాకుళంలో గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ మహాలక్ష్మి నగర్ కాలనీ, డీఈఓ ఆఫీస్ ఆవరణలో జరగబోతుందని తెలిపారు.‌ మరిన్ని వివరాలకు 9655035217 నంబరును సంప్రదించగలరు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!