ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీజిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ని కలిసిన పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ని కలిసిన పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు

📰 Generate e-Paper Clip

అనకాపల్లి, జయజయహే : అనకాపల్లి జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాని మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలోని పోలీస్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ వినతి పత్రంలోని అంశాలను గమనించి, వాటిపై త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పోలీస్ అధికారుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అప్పలనాయుడు, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం సభ్యులు ఎస్సై శేషగిరిరావు, మహిళా హెడ్ కానిస్టేబుల్ లలిత, జిల్లా కమిటీ సభ్యులు మొహిద్దిన్, అచ్చయ్య, శేషాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!