ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeవిద్య సమాచారంసజావుగా పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి

సజావుగా పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

విశాఖపట్నం, జయజయహే : జిల్లాలో ఈ నెల 19 నుండి 28వ తేదీ వరకు జరగబోవు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మరియు 12వ తేది నుండి 17వ తేదీ వరకు జరగబోవు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్ దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వతేది నుండి 28వ తేదీ వరకు జరగబోవు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మరియు 12వతేది నుండి 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరపు పబ్లిక్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో జరగనున్నందున, నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా, విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు……

ఈ నెల 19వతేది నుండి 28వ తేదీ వరకు జరగబోవు పదవ తరగతి పరీక్షలు ఉదయం 9-30గంటల నుండి 12-45 గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. మొత్తం 4563 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. అందులో 3152 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 1411మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇందుకోసం 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 27 మంది చీఫ్ సూపర్డెంట్లను, 27 మంది డిపార్ట్మెంట్ అధికారులను, నలుగురు రూట్ ఆఫీసర్లను, మరో నలుగురు అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను పరీక్షలు నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. పదవ తరగతి క్వశ్చన్ పేపర్స్ ప్రభుత్వ క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్ నుండి సెంటర్స్ కు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరపు పబ్లిక్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు..ఈ నెల 12 నుండి 17వ తేదీ వరకు జరగబోవు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రతిరోజు ఉదయం 9-00 గంటల నుండి 12-00 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, అదేవిధంగా మధ్యాహ్నం 2-30 గంటల నుండి 5-30 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం 66 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణ లో భాగంగా సమన్వయంతో పనిచేసి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను, ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పరీక్ష కేంద్రాల లో లైట్లు, టాలెట్స్, డెస్క్ లు, ఫర్నిచర్ ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ పనుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్న వాటి పరిష్కారానికై జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్, వాచ్, ఎలక్ట్రానిక్ తదితర వస్తువులను అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో 200 మీటర్ల దూరంలో ఉన్న ఫోటో జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద అత్యవసర మందులతో పాటు ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలు వ్రాసే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా జరగాలని, పోలీసు బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్ విధివిధానాలు, ప్రశ్న పత్రాలు మరియు జవాబు పత్రాలు తరలింపులు తదితర అంశాలపై ఆయా శాఖ అధికారులు దృష్టిని సారించాలన్నారు. పరీక్ష కేంద్రానికి హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికి చేరుకునేలా ప్రణాళిక బద్ధంగా ఆయా రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పోస్టల్ శాఖ యధావిధిగా జరిగే పరీక్షల నిర్వహణ ను ప్రభుత్వ నియమ నిబంధన మేరకు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు, జి వి ఎమ్ సి, వైధ్య ఆరోగ్య శాఖ, ఎ పి ఎస్ ఆర్ టి.సి., విధ్యత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!