ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసింహాచలం దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యం : ప్రియాంక దండి

సింహాచలం దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యం : ప్రియాంక దండి

📰 Generate e-Paper Clip

జయజయహే : చందనోత్సవం సందర్బంగా రాష్ట్రం నలుమూలల నుండి అప్పన్న దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారని ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయి, పలువురు తీవ్రంగా గాయపడితే గోరమైన ఘటన జరిగాక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నం, ప్రభుత్వం తరుపున ఆ కుటుంబానికి అండగా ఉంటాం అనే స్టేట్మెంట్ తో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సరిపెడితే సరిపోతుందా అని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రియాంక దండి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తిరుపతిలో ఘటన జరిగి కొద్ది నెలలు కూడ కాలేదు, అప్పుడే సింహాచలంలో మరో ఘటన. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ప్రియాంక విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేతకాని తనం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!