ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగపరుచుకోండి

వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగపరుచుకోండి

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : వేసవిలో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వారిలో మానసిక ఉల్లాసం పెంచేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోపరుచుకోవాలని గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి కోరారు. సోమవారం మాడుగుల శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి బై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈనెల 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు 40 రోజులు పాటు గ్రంథాలయంలో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని గ్రంథాలయ అధికారీ తెలిపారు. ఈ శిబిరంలో విద్యార్ధులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.కాబట్టి వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డీ సూర్యారావు,ఆర్య వైశ్య సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు, ఈవో మూర్తి బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణరావు, విశ్వహిందూ పరిషత్తు పరిషత్తు ప్రతినిధి బి గంగాధర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!