ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రజా దర్బార్ లో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

ప్రజా దర్బార్ లో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

📰 Generate e-Paper Clip

పెందుర్తి : జయజయహే: పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79 వ వార్డు దేశపాత్రునిపాలెం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకొని ప్రజా సమస్యలపై వార్డ్ లో సాయి నగర్, జాజులవానిపాలెం, దేశపాత్రను పాలెం గ్రామాలలో పర్యటన చేసి అంగన్వాడి బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, జాజులవానపాలెం చెరువులను పరిశీలించడం జరిగినది. అనంతరం ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైన్సు, యువతకి ఉపాధి అవకాశాలు, పొల్యూషన్, ఆక్రమణలు, కరెంటు లో ఉండే సమస్య, మెయిన్ రోడ్డు వెడల్పు, రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణంలో ఉన్న షాపులను తీసివేయట, హౌసింగ్, పెన్షన్స్ మరియు రేషన్ కార్డుల కొరకు ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అధికారులతో పాటు నిర్వహించిన ప్రజాదర్బాలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. వీరితోపాటు జీవీఎంసీ జోన్ 6 జోనల్ కమిషనర్ రామ సత్య శేషాద్రి , పరవాడ మండలం ఎమ్మార్వో అంబేద్కర్ , జోన్ 6 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు , జోన్ ఏ ఎమ్ హెచ్ ఓ కిరణ్ , పంచకర్ల ప్రసాద్ రావు ,వార్డ్ అధ్యక్షులు పిల్లా శివ కృష్ణ , మచ్చ శివకుమార్ , మండల పార్టీ అధ్యక్షులు బొడ్దపు శ్రీనివాస్ , వైయ్యపు చిన్న , మోటారు సన్యాసినాయుడు , చింతకాయల ముత్యాల , సత్తివాడ జ్యోతి , లక్కరాజు శ్రీనివాస్ , గోపి , బిగిది రామ గోవింద , అయితే సింహాచలం ,ముమ్మన గురువు,ముక్క సంతోష్ ,బర్నకం సత్య రావు , కేఎన్ఆర్ , పావని మొదలగు స్థానిక గ్రామ పెద్దలు మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!