ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విషప్రయోగం పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులు…

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విషప్రయోగం పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులు…

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లా: జయజయహే : ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం కలకలం రేపింది . ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూసారు.పురుగుల మందు వాసన రావడం, పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండడంతో ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తమయ్యారు.అప్రమత్తమై పిల్లలను త్రాగు నీరు నల్లాల వైపు వెళ్లనివ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది …విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు . పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విషం ఎవరు కలిపారు అనే కోణం లో పోలీసులుర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!