Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీనామినేటెడ్ పోస్టుల్లో వాడ బలిజకు న్యాయం చేయాలి

నామినేటెడ్ పోస్టుల్లో వాడ బలిజకు న్యాయం చేయాలి

విశాఖపట్నం: జయజయహే : మెజారిటీ మత్స్యకార జనాభా కలిగిన వాడబలిజ ఉప కులానికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును గురువారం ఎం.వి.పి. కాలనీలోని ఆయన నివాసంలో కలిసిన ఆ సంఘం నాయకులు కోరారు. మత్స్యకారుల్లోని 12 ఉప కులాల్లో వాడ బలిజలు 31 శాతంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిర్భావం నుంచి టీడీపీని వెన్నంటి ఉన్న వాడ బలిజ కంటే తక్కువ జనాభా ఉన్న ఉప కులాలకు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తానని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ అప్పారావు, ఇతర వాడ బలిజ సంఘం ప్రతినిధులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?