ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీరెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

📰 Generate e-Paper Clip

అనంతగిరి : జయ జయహే : అనంతగిరి మండలం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండల రెవెన్యూ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో బీంపోలు పంచాయితీలో పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్థానికంగా నివసిస్తూ భూమి లేని గిరిజనులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ ఆక్రమణ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మండలంలో వివిధ శాఖల పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మలేరియా, డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా పోస్టర్స్ ను ఆవిష్కరించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక దృష్టీ పెట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దిసారి గంగరాజు ఎంపీడీఓ కుమార్ మండల అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు.

                           

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!