రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
అనంతగిరి : జయ జయహే : అనంతగిరి మండలం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండల రెవెన్యూ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో బీంపోలు పంచాయితీలో పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్థానికంగా నివసిస్తూ భూమి లేని గిరిజనులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ ఆక్రమణ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మండలంలో వివిధ శాఖల పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు....