నామినేటెడ్ పోస్టుల్లో వాడ బలిజకు న్యాయం చేయాలి
విశాఖపట్నం: జయజయహే : మెజారిటీ మత్స్యకార జనాభా కలిగిన వాడబలిజ ఉప కులానికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును గురువారం ఎం.వి.పి. కాలనీలోని ఆయన నివాసంలో కలిసిన ఆ సంఘం నాయకులు కోరారు. మత్స్యకారుల్లోని 12 ఉప కులాల్లో వాడ బలిజలు 31 శాతంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిర్భావం నుంచి టీడీపీని వెన్నంటి ఉన్న వాడ బలిజ కంటే తక్కువ జనాభా ఉన్న ఉప కులాలకు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు....