ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్
శ్రీకాకుళం: జయజయహే : టొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ, నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఎనబై అడుగుల కూడలిలో మోడీ టొయోటా గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన వాహనాలు మూడు రోజులు పాటు ప్రదర్శనలో ఉంటాయని, టయోటా వారు అందిస్తున్న కార్లులో బడ్జెట్ నుండి, హై బడ్జెట్ వరకు అందరికి అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజుల ఆఫర్లను పొంది వాహనాలను కొనుగోలు చేయాలన్నారు. మోడీ టయోటా వైస్ ప్రెసిడెంట్ పిబి.ఆచారి మాట్లాడుతూ వాహనంపై సుమారుగా ఒకటిన్నర లక్షల రూపాయలు తగ్గింపు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పృథ్వి, సుదీర్, రవి, శివ, భాష, సర్పంచ్ గుండ భాస్కర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

