ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅంతరించిపోతున్న కొన్ని జాతులను సంరక్షించాలి

అంతరించిపోతున్న కొన్ని జాతులను సంరక్షించాలి

📰 Generate e-Paper Clip

లైన్స్ క్లబ్ మార్కెటింగ్ చైర్పెర్సన్ ఉర్లం.శివతేజ

శ్రీకాకుళం: జయజయహే : అంతరించిపోతున్న కొన్ని జాతులను సంరక్షించాలని లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పెర్సన్ ఉర్లం.శివతేజ శుక్రవారం అన్నారు. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న జాతులను సంరక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలు అమూల్యమైనవని, వాటి సంరక్షణ బాధ్యతలో మనమంతా బాగమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా రక్షిత వృక్ష, జంతు జాతుల జాబితాలను కలిగి ఉందని, మన స్థానిక చేపలు, మొక్కలు, ఇతర వన్యప్రాణులను అంతరించిపోకుండా కాపాడితే పర్యావరణ వ్యవస్థకు హానికలగదన్నారు. ఒకసారి అదృశ్యమైతే, అవి శాశ్వతంగా అదృశ్యమవ్వటమే కాకుండా మళ్ళీ తిరిగి రాలేవన్నారు. ఒక్క జాతిని కోల్పోవడం కూడా మిగిలిన పర్యావరణ వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాలను చూపుతుందని, ప్రాణాంతక వ్యాధులకు నివారణలను అందించడం నుండి సహజ పర్యావరణ వ్యవస్థలను మెరుగుపరుస్తుందన్నారు. ఇప్పటికే కొన్ని జాతులతోపాటు పిచ్చుకలు కూడా కనుమరుగయ్యావని, వాటికి ఇదివరకు గూడులుండేవని, ఆహారవణాలు సైతం లేకపోవటంతో అంతరించిపోతున్నాయన్నారు. వేసవితాపం ఎక్కువ ఉంటున్నాయని వీలైతే పక్షులకు ఒక పాత్రలో నీటిని వేసి, కొంత ఆహారాన్ని ఇంటి పైభాగంలో ఉంచాలన్నారు. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి పర్యావరణ పరిరక్షణలో బాగమవ్వాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!