ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీచింతామణి పాత్రధారికి ఘనంగా సన్మానం

చింతామణి పాత్రధారికి ఘనంగా సన్మానం

📰 Generate e-Paper Clip

జయజయహే : శ్రీ ముత్యమాంబ జాతర ఉత్సవాల్లో చింతామణి పాత్రధారి జి రత్నశ్రీ ని ఘనంగా సన్మానించితిరి జీవీఎంసీ 88 వ వార్డు వెదుళ్ళనరవ గ్రామం శ్రీ ముత్యమాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ సత్య సాయి కళామండలి కడప వారిచే” భక్త చింతామణి ” అను నాటకం కడు రమ్యంగా ప్రదర్శించబడినది. చింతామణి పాత్రధారి నాట్య మయూరి జి రత్నశ్రీ ని అగనంపూడి కళా రంగ సమైక్య తరపున ఆమెను ఘనంగా సన్మానించడం జరిగినది. ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పురాతన నాటిక రంగాన్ని కనుమరుగవుతున్న రోజుల్లో ఇటువంటి కళాకారులను భావితరాలకు అందించే విధంగా వెదుళ్ళనరవ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్త చింతామణి నాటకమును ప్రదర్శిన ఏర్పాటు చేయడం అభినందినీయమని అన్నారు. జి రత్నశ్రీ మాట్లాడుతూ మాలాంటి కళాకారులని ప్రోత్సహించడానికి ఈ గ్రామం పెద్దలు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని నేను మన తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో సుమారు 3000 ప్రదర్శనలో పైగా ఇవ్వడం జరిగిందని నా నటనకి ప్రశంసించి వివిధ సంఘాలు వారు సువర్ణ అష్టకంకణం, కందుకూరి పుష్కరం, మహానటి సావిత్రి అవార్డులు అందజేయడం జరిగిందని అన్నారు, చింతామణి, సత్యభామ, సత్య హరిచంద్ర లో చంద్రమతి పాత్రలో వేశానని కొన్ని సినిమాల్లో కూడా ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జీవీఎంసీ 88 వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు సీనియర్ కళాకారులు విందుల వరహాలు, పెదమడక శ్రీ సంపత్ వినాయక ఆలయ కమిటీ అధ్యక్షులు మోటూరు వెంకటరమణ ఉత్సవ కమిటీ చైర్మన్ సారిపల్లి అన్నాజీరావు, చొప్ప పోలరావు ,ప్రోగ్రాం ఇంచార్జ్ సానబోయిన సీతయ్య ,సర్వసిద్ధి బొర్రయ్య, చొప్ప అప్పలనాయుడు. హార్మోనిస్టు కే సత్యబాబు ఉత్సవ కమిటీ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!