ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeసినిమాశోభన్ బాబు నటించిన జీవనజ్యోతి చిత్రానికి 50 వసంతాలు పూర్తి

శోభన్ బాబు నటించిన జీవనజ్యోతి చిత్రానికి 50 వసంతాలు పూర్తి

📰 Generate e-Paper Clip

భీమవరం : జయజయహే : సినీనటులు అందాల నటుడు శోభన్ బాబు నట జీవితంలో 1975 కు ఒక ప్రత్యేకత ఉందని, ఈ ఏడాదిలో చేసిన ప్రతి చిత్రం ఎంతో ఘన విజయాలు సాధించాయని, అందులోనే “జీవనజ్యోతి” చిత్రానికి 50 వసంతాలు పూర్తి అయ్యాయని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు భట్టిప్రోలు శ్రీనివాసరావు, పూడి శ్రీనివాస్, బొండా రాంబాబు, లంకలపల్లి చాముండేశ్వరావు అన్నారు. గురువారం భీమవరంలో అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో “జీవనజ్యోతి” చిత్ర 50 వసంతాల వేడుకలను నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ శోభన్ బాబు నాల్గొవ చిత్రంగా డివిఎస్ రాజు దర్శకత్వంలో కె విశ్వనాధ్ నిర్మించిన జీవనజ్యోతి చిత్రం మంచి విజయం సాధించి మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిందని, 90 శాతం ఈ చిత్రం కోనసీమలోనే చిత్రీకరించారని, ఈ చిత్రం భీమవరం లోని సత్యనారాయణ థియేటర్ లో 100 రోజులు ప్రదర్శించారని అన్నారు. శోభన్ బాబు నటనకు ఆ ఏడాదిలోనే 8 సంస్థల నుంచి ఉత్తమ నటులు అవార్డులు లభించాయని, ఈ జీవనజ్యోతి” చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు లభించిందన్నారు. విశ్వనాథ్, శోభన్ బాబు కలయికలో నాల్గోవ బంగారు నంది గెలుచుకున్న చిత్రం జీవన జ్యోతి అని అన్నారు. ఇటువంటి చక్కటి చిత్రం విడుదలై నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అభిమానులకు ఎంతో ఆనందించదగ్గ విషయమని మాజీ ఎమ్. ల్. సి. ఎమ్. సుధాకర్ బాబు,బి. బాలసుబ్రమణ్యం, టి. వీర ప్రసాద్, టి. సాయికామరాజు, ఎస్. ఎన్.రావు. కుర్ర రాంబాబు, యు. విజయ్, ధార సత్యనారాయణ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!