ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeభక్తివైభవంగా అనంత పద్మనాభస్వామి శిఖర ప్రతిష్ట

వైభవంగా అనంత పద్మనాభస్వామి శిఖర ప్రతిష్ట

📰 Generate e-Paper Clip

ఘాట్ రోడ్డు ప్రారంభించిన గంటా

పద్మనాభం, జయజయహే : పద్మనాభం మండలంలోని అనంత పద్మనాభస్వామి వారి ఆలయంలో శుక్రవారం శిఖర ప్రతిష్ట జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గోవింద నామ స్మరణల మధ్య వైదికులు స్వామి వారి శిఖరాన్ని ప్రతిష్టించారు. రూ.60 లక్షలతో విమాన గోపురం, అర్ధ మండపం, ముఖ మండపం నిర్మించారు. అలాగే అనంతుని ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన యాగంలో గంటా పాల్గొన్నారు. అనంతరం అనంత పద్మనాభస్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల అయిన అనంత పద్మనాభస్వామి ఆలయ ఘాట్ రోడ్డును ప్రారంభించారు. ఘాట్ రోడ్డును రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఆలయానికి సంబంధించిన రెండు ప్రధాన పనులను ఒకేరోజు ప్రారంభించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

                           

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!