వైభవంగా అనంత పద్మనాభస్వామి శిఖర ప్రతిష్ట

ఘాట్ రోడ్డు ప్రారంభించిన గంటా పద్మనాభం, జయజయహే : పద్మనాభం మండలంలోని అనంత పద్మనాభస్వామి వారి ఆలయంలో శుక్రవారం శిఖర ప్రతిష్ట జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గోవింద నామ స్మరణల మధ్య వైదికులు స్వామి వారి శిఖరాన్ని ప్రతిష్టించారు. రూ.60 లక్షలతో విమాన గోపురం, అర్ధ మండపం, ముఖ మండపం నిర్మించారు. అలాగే అనంతుని ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన యాగంలో గంటా పాల్గొన్నారు. అనంతరం అనంత పద్మనాభస్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల...