ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeభక్తిమోదకొండమ్మ జాతర పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మోదకొండమ్మ జాతర పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

మాడుగుల: జయజయహే : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, మాడుగుల ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ వారి జాతర జూన్ మూడో తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్సవ పోస్టర్ను గురువారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పంచాయతీరాజ్ అతిధి గృహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమ్మవారి జాతరను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జాతరలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. ప్రజలంతా ఉత్సవాన్ని ఇచ్చే ప్రయత్నం చేసే విధంగా కమిటీ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజు, సభ్యులు డి సూర్యరావు ఎస్ శ్రీనివాసరావు బీహెచ్ పైడి నాయుడు, ఎంపీపీ రాజారాం, గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉప సర్పంచ్ జె వరహాలు కూటమి నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!