మోదకొండమ్మ జాతర పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మాడుగుల: జయజయహే : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, మాడుగుల ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ వారి జాతర జూన్ మూడో తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్సవ పోస్టర్ను గురువారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పంచాయతీరాజ్ అతిధి గృహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమ్మవారి జాతరను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జాతరలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా...