ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeభక్తిఘనంగా వాసవి జయంతి వేడుకలు

ఘనంగా వాసవి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం మాడుగులలో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో సామూహిక కుంకుమ పూజలు, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు వాసవి కుటుంబ సభ్యులుచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కోట్యాడ రమేష్. వనిత క్లబ్ ప్రెసిడెంట్ పుట్టా రాధిక, జోన్ చైర్మన్ పుట్టా మాధవి, క్లబ్ సెక్రటరీ లు కోట్యాడ దేముళ్ల. ట్రెజరర్ జే కామేష్, బత్తుల అరుణ. క్లబ్ జోన్ చైర్మన్ ఆర్య వైశ్య జిల్లా ఉపాధ్యక్షలు శ్రీనాదు శ్రీనివాసరావు. క్లబ్ సభ్యులు పుట్టా బలరాం.మామిడి శ్రీను జాగాని కృష్ణ పార్వతీశం, జాగాని కిషోర్. పుట్టా రెడ్డి. ఎస్ ఆర్ కె ప్రసాద. శ్రీనాదు రమేష్, జాగాని లీలావతి, జాగాని పద్మ, శ్రీనాదు సుమన్ ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!