జయజయహే : జీవీఎంసీ 48వ వార్డులో వీధి దీపాల ఏర్పాటు పై గంకల కవిత అప్పారావు యాదవ్ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం,నేడు అధికారులతో కలిసి వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు నేడు జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ 48వ వార్డుల గల ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2,ఇందిరానగర్ -3, ఇందిరానగర్ -4,ఇందిరానగర్ -5 ప్రాంతంలో వీదిపాలు వెలగడం లేదని గతంలో వచ్చిన ఫిర్యాదు పై మంగళవారం అధికారులతో విస్తృత పర్యటన చేశారు.జీవీఎంసీ ఎలక్ట్రికల్ డిఈ బాబురావు,ఏఈ అర్చన ఆధ్వర్యంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా పగటి నుంచి రాత్రి వరకు నేరుగా వార్డులో పర్యటన చేసి వీధి దీపాల సమస్యకు పరిష్కారం చూపారు. 48 వ వార్డులో పలుచోట్ల విద్యుత్ దీపాలు వెలగడం లేదని వీటి వల్ల చిల్లర దొంగతనాలు,ఆకతాయిలు ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని,వృద్ధులు,వికలాంగులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో ఫిర్యాదు అందిందని ఫిర్యాదు పై అధికారులతో సంప్రదించి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డులో పర్యటన చేసి పలుచోట్ల విద్యుత్ దీపాలు మరమ్మత్తులు చేయడం జరిగిందని, మరికొన్ని చోట్ల నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు గంకల కవితా అప్పారావు యాదవ్ తెలిపారు. 48వ వార్డులో విద్యుత్ దీపాల సమస్య అనేది లేకుండా చేస్తానని గంకల హామీ ఇచ్చారు. వార్డులో వీధి దీపాలు వెలగక ఏ ప్రాంతంలోనైనా ఇబ్బంది నెలకొంటే తక్షణమే తనకు సమాచారం అందజేయాలని కోరారు.వార్డు ప్రజల సమస్యపై స్పందించి సమస్య పరిష్కారం చూపిన జీవీఎంసీ ఎలక్ట్రికల్ డిఈ బాబురావు,ఏఈ అర్చనకు వార్డు ప్రజలు తరపున గంకల కవిత అప్పారావు యాదవ్ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని,వార్డు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే తన సంప్రదించాలన్నారు. వార్డు ప్రజల సమస్యలపై గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కారం చూపుతున్న గంకల కవిత అప్పారావు యాదవ్ ను వార్డు ప్రజలు అభినందించారు.


