ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeవిద్య సమాచారంగవర్నమెంట్ జాబ్ ముద్దు- గవర్నమెంట్ బడులు వద్దా?

గవర్నమెంట్ జాబ్ ముద్దు- గవర్నమెంట్ బడులు వద్దా?

📰 Generate e-Paper Clip

జయజయహే : నేటి సమాజంలో ఒక విస్మయకరమైన వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. లక్షలాది కుటుంబాలు తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు . కానీ అదే కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. ఇది సగటు సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఏర్పడిన అపనమ్మకానికి ప్రతిబింబం. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఎందుకు తగ్గింది? ప్రభుత్వ బడులపై వ్యతిరేకతకు కొన్ని కారణాలు

మౌలిక వసతుల లోపం: తాగునీరు, టాయిలెట్లు, మెస్ లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వంటివి చాలా చోట్ల సరిగా లేకపోవడం.

శాశ్వత భవనాల లేమి: కొన్ని స్కూల్లు అద్దె భవనాల్లో నడుస్తూ, ఆటస్థలాల్లేకుండా కొనసాగుతుండడం.

ఉపాధ్యాయుల కొరత : ఖాళీ పోస్టులు నింపకపోవడం, తరచు బదిలీలు.

నిర్లక్ష్య బోధన: కొంతమంది ఉపాధ్యాయుల్లో ఉన్న అంకితభావ లోపం.

ఆంగ్ల మాధ్యమ ఆకర్షణ: “ఇంగ్లీష్ మాధ్యమం తప్ప భవిష్యత్తు లేదు” అన్న అపోహ.

ఫలితాలపై అపోహలు: ప్రైవేట్ పాఠశాలలు 100% ఫలితాలతో ఆకట్టుకుంటే, ప్రభుత్వ బడుల విజయాలు ప్రచార లోపంతో మిగులుతాయి.

ప్రతిష్టాపరమైన అపోహలు: “పేదవాళ్ళ పిల్లల స్కూల్” అనే తప్పుడు దృక్పథం. కానీ వీటన్నిటిని అధిగమించి చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనలతో ప్రైవేటు పాఠశాలకు దీటుగా మంచి ఫలితాల రాబట్టడం జరిగింది ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో అనేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లవారికంటే మెరుగైన ఫలితాలు సాధించారు. పలు ప్రభుత్వ బడులు నూతన మౌలిక వసతులు, ఆంగ్ల మాధ్యమ బోధనతో ఆకర్షణీయంగా మారాయి. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్లు, ప్రముఖులు చాలామంది ప్రభుత్వ బడులే చదివినవారే.

ప్రభుత్వ బడుల విలువ

ప్రభుత్వ బడులలో మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండడం , ఉచితంగా విలువలతో కూడిన విద్యా బోధనలు చేయడం అది సామాజిక సమానత్వంకి: అన్ని వర్గాల పిల్లలు ఒకే స్థాయిలో విద్యనభ్యసించడం వంటివి ప్రభుత్వ బడుల విశ్వసనీయతను మచ్చు తునక ప్రభుత్వ బడుల విశ్వసనీయతను పెంచే కొన్ని మార్గాలు…

మౌలిక వసతుల అభివృద్ధి: స్మార్ట్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, పరిశుభ్రత, ఆటస్థలాలు.

ఉపాధ్యాయ నియామకాలు: ఖాళీ పోస్టుల భర్తీ, శిక్షణతో నాణ్యత గల బోధన.

విద్యా విధానాల నవీకరణ : నైతిక విలువలు, పౌర శాస్త్రం, సామాజిక బాధ్యతలపై ఆధారిత పాఠ్యాంశాలు.

సానుకూల అవగాహన: విజయవంతమైన విద్యార్థుల కథలు, ప్రభుత్వ పాఠశాలల విజయాలను ప్రజల్లోకి తీసుకురావడం.

ప్రభుత్వాలు గవర్నమెంట్ బడులలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెంచితే ప్రభుత్వ పాఠశాలల పట్ల మార్పు ఎవరి నుండి మొదలవాలి?

ప్రభుత్వాలు – వసతులు కల్పించాలి, నాణ్యమైన టీచర్లను నియమించాలి.

ఉపాధ్యాయులు – తమ బాధ్యతను నిబద్ధతగా నిర్వర్తించాలి.

తల్లిదండ్రులు – ప్రభుత్వ బడులపై విశ్వాసంతో పిల్లలను చేర్చాలి.

సమాజం – ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను అర్థం చేసుకుని ఆ మౌలికతను గౌరవించాలి.

ప్రభుత్వాలు ఇప్పటికే ప్రభుత్వ బడులలో మధ్యాహ్న భోజనం కల్పించడం, ప్రభుత్వ హాస్టలలో మెస్ ఛార్జీలు పెంచడం, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం చేస్తున్నా కూడా ఇంకా చాలా మందిలో ప్రభుత్వ పాఠశాలల పట్ల అపనమ్మకం పోవట్లేదు, బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే ప్రభుత్వ బడులు అనే నినాదం మారి అందరికి నాణ్యమైన విద్య ప్రభుత్వ బడులతో కూడా సాధ్యం అనే విధంగా ముందుకు సాగినప్పుడే ప్రభుత్వ బడుల పట్ల సమాజంలో నమ్మకం పెరుగుతుంది . గవర్నమెంట్ బడులు పిల్లలను ఉన్నతమైన భవిష్యత్తు వైపు నడిపించే గుడులు, వాటిని నమ్మడం ప్రోత్సహించడం అందరి బాధ్యత

జి. అజయ్ కుమార్

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!