Saturday, April 11, 2026
Homeబిగ్ బాస్పేదల సేవలో ప్రభుత్వం

పేదల సేవలో ప్రభుత్వం

గిరిజనకాలనీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన చంద్రబాబు…సీఎం తమ కాలనీకి విచ్చేయడం ..తమను ఆప్యాయంగా పలకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన గిరిజనులు పలు సమస్యలపై చంద్రబాబుకు అర్జీలు అందించిన ప్రజలు… వెంటనే పరిష్కరిచాలని కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం ఎస్టీ కాలనీలో ‘‘పేదల సేవలో ప్రభుత్వం’’ కార్యక్రమంలో భాగంగా సుస్మిత అనే గిరిజన యువతి ఇంటికి వెళ్లి ఎన్‌టిఆర్‌ భరోసా పింఛన్‌ స్వయంగా అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వితంతు పింఛను పొందుతున్న గిరిజన యువతి సుస్మిత, ఆమె తల్లిదండ్రులు అంకోజి, సుమ, సోదరుడితో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకుని…ఈ నిరుపేద గిరిజన కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం నుంచి కొండంత భరోసా కల్పించిన సీఎం భర్తను కోల్పోయిన గిరిజన యువతి సుస్మితకు డిఎస్సీ కోచింగ్‌ ఇప్పించాలని, ఐటిఐ చదివిన ఆమె తమ్ముడికి వ్యవసాయ అవసరాలకు వినియోగించే డ్రోన్‌ ఇప్పించి ఉపాధి కల్పించాలని, సుస్మిత కుమార్తె ఐదేళ్ల చిన్నారి చేత్రికని గురుకుల పాఠశాలలో చేర్చించి విద్యనభ్యసించేలా చర్యలు చేపట్టాలని… ఈ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కలెక్టర్‌ ఆనంద్‌ను ఆదేశించిన సీఎం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?