ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసింహగిరి పై ఉచిత మెడికల్ క్యాంపు

సింహగిరి పై ఉచిత మెడికల్ క్యాంపు

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే : సింహాచలం చందనోత్సవం పురస్కరించుకొని భక్తులు సౌకర్యార్థం ఉచిత మెడికల్ క్యాంపు ఆప్ సబ్ కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ( అధ్యక్షుడు శివ వడ్లమూడి), విజ్ఞాన్ ఫార్మా కాలేజ్, లీవ్ ఇన్స్యూర్, సత్యం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహణ సింహాచలం కొండపైన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థినీ విద్యార్థులు చురుకుగా పాల్గొని రక్తపోటు, మధుమేహం వాటి పై సరైన అవగాహన కల్పించారు. భక్తులు ఆరోగ్యం పట్ల ఉన్న సందేహాలు నివృత్తి చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంకు భక్తులు నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించిన విజ్ఞాన్ ఫార్మా అసోసియేట్ ప్రొఫెసర్ రాజేష్( లివ్ ఇన్సుర్), మెడికవర్ సిబ్బంది, విజ్ఞాన్ ఫార్మా కాలేజ్, సత్యం నర్సింగ్ కాలేజ్ మరియు ఆప్ సబ్ కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ కు ఆలయ సిబ్బంది, భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!