ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeవిద్య సమాచారంటెన్త్ లో ఉత్తమ విద్యార్థులకు అభినందన

టెన్త్ లో ఉత్తమ విద్యార్థులకు అభినందన

📰 Generate e-Paper Clip

చోడవరం : జయజయహే : ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చోడవరం మండలంలో గల 14 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన 16 మంది విద్యార్థి, విద్యార్థులను సోమవారం మండల విద్యాశాఖాదికారి కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాది కారులు బి. పడాలదాస్, కె. సింహాచలం మండల విద్యాశాధికారి కార్యాలయ సిబ్బంది అభినందన సభ ఏర్పాటు చేసి విధ్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు మాట్లాడుతూ ఈ సంవత్సరం సాధించిన ఫలితాలు పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థులు పట్టుదతో ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించారని,పిల్లల విజయాలలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు.ఈ విజయాన్ని సాధించిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, నిరంతరం చదువులో నూతన నైపుణ్యాలను అభ్యసిస్తూ ,వ్యక్తిత్వ వికాసాన్ని సాధిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు.సాదారణ విద్యార్థులు చే సాధించిన అసాధారణ ఫలితాలు గా పేర్కొంటూ, ఈ విద్యార్థులను ముందుండి ఇంత మంచి మార్కులు సాధించడానికి కారణం అయిన ఉపాధ్యాయుల కృషి ని అభినందించుట జరిగింది.ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రవిశంకర్,శిరీషా, నాగలక్ష్మి,కె.వి.యమ్.నాయుడు,సరోజిని, భూలక్ష్మి, చంద్రిక, సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!