ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవిలువలతో కూడిన సందేశాత్మక నాటికలు

విలువలతో కూడిన సందేశాత్మక నాటికలు

📰 Generate e-Paper Clip

ఆకట్టుకున్న మా ఇంట్లో మహాభారతం, చిగురు మేఘం, నా శత్రువు నాటికలు

భీమవరం : జయజయహే : భీమవరం గన్నాబత్తుల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయస్థాయి నాటక పోటీల్లో శుక్రవారం రాత్రి ప్రదర్శిరించిన మూడు నాటికలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు నాటిక పోటీలను డా ఎంఆర్ రాజు, డా పిఆర్ కె వర్మ, డా వేగేశ్న రవికుమార్ రాజు, చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువభేరీ థియేటర్ ఆర్గనైజేషన్ వారి “నా శత్రువు”, అమరావతి ఆర్ట్స్ వారి ” చిగురు మేఘం”, మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ చిలకలూరి పేట వారి “మా ఇంట్లో మహాభారతం” వంటి నాటికలు చూపరులను అలరించాయి. కులం కన్నా గుణం ముఖ్యం .. చదువుకుంటే లోకజ్ఞానం చేసుకోవచ్చు అనే నీతితో మా ఇంట్లో మహాభారతం నాటికను ప్రదర్శించారు. డబ్బు సంపాదనే ద్యేయంగా విలువలు కోల్పోయి నడుస్తున్న తీరుపై “చిగురు మేఘం” నాటకం సాగింది. న్యాయ నిర్ణేతలుగా నుసుము నాగభూషణం (గుంటూరు), లండ రుద్రమూర్తి (భిలాయి), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు) వ్యవహరించారు. మంతెన రామ్కుమార్ రాజు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, పేరిచర్ల లక్ష్మణ వర్మ, కృత్తివెంటి సత్యకుమార్, పెన్నాడ శ్రీను , రమణ మూర్తి,చంద్రాభట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!