కాకినాడ: జయజయహే : వేదాంగమైన జ్యోతిష్యశాస్త్రంలోని వివిధ అంశాలపై ప్రముఖ పండితులు, పంచాంగ కర్త డాక్టర్ సరిపెల్ల శ్రీరామ చంద్ర మూర్తి రచించిన పరిశోధన గ్రంథం జాతక మాణిక్యం పుస్తకావిష్కరణ ఈ నెల 27న నిర్వహిస్తారు. స్థానిక చల్లా ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం 6.26గంటలకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చేతుల విూదుగా ఈ పుస్తకావిష్కరణ జరుగుతుందని రచయిత సరిపెల్ల తెలిపారు. సంస్కృత భాషలో ఋషీశ్వరులు చెప్పిన అనేక యోగ విశేషాలు సోదాహరణంగా తేటతెలుగులో సరిపెల్ల ఈ గ్రంథంలో వివరించామన్నారు. ఈ శాస్త్రంపై మక్కవ గలవారికే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో జోతిష్య విద్యాభ్యాసం చేసేవారికి ఈ గ్రంథం చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మనో విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు డాక్టర్ వింజమూరి జనార్ధనం అధ్యక్షతన జరిగే సభలో ప్రముఖ సాహితీవేత్త బ్రహ్మశ్రీ కాశీబొట్ల సత్యనారాయణ, రెడ్‌క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ పాలపర్తి సుబ్బారావు, తదితరులు పాల్గొంటారన్నారు. ఆస్వాదన సాహితీ సమితి వ్యవస్థాపకులు గొట్టుముక్కల వెంకట సత్యనరసింహమూర్తి పుస్తక సవిూక్ష నిర్వహిస్తారని చెప్పారు.
27న సరిపెల్ల విరచిత జాతక మాణిక్యం ఆవిష్కరణ
RELATED ARTICLES
