27న సరిపెల్ల విరచిత జాతక మాణిక్యం ఆవిష్కరణ
కాకినాడ: జయజయహే : వేదాంగమైన జ్యోతిష్యశాస్త్రంలోని వివిధ అంశాలపై ప్రముఖ పండితులు, పంచాంగ కర్త డాక్టర్ సరిపెల్ల శ్రీరామ చంద్ర మూర్తి రచించిన పరిశోధన గ్రంథం జాతక మాణిక్యం పుస్తకావిష్కరణ ఈ నెల 27న నిర్వహిస్తారు. స్థానిక చల్లా ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం 6.26గంటలకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చేతుల విూదుగా ఈ పుస్తకావిష్కరణ జరుగుతుందని రచయిత సరిపెల్ల తెలిపారు. సంస్కృత భాషలో ఋషీశ్వరులు చెప్పిన అనేక యోగ విశేషాలు సోదాహరణంగా తేటతెలుగులో సరిపెల్ల ఈ గ్రంథంలో వివరించామన్నారు. ఈ...