ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeసినిమాఏ.ఆర్ .రెహమాన్ కు .. 2 కోట్లు ఫైన్

ఏ.ఆర్ .రెహమాన్ కు .. 2 కోట్లు ఫైన్

📰 Generate e-Paper Clip

జయజయహే : ఏ.ఆర్ రెహమాన్ కాపీరైట్ వివాదంలో చిక్కుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ – 2’ చిత్రంలోని “వీరా రాజా వీరా” అనే పాటలో కాపీరైట్ జరిగిందన్న ఆరోపణలపై కోర్టు షాకింగ్ తీర్పు వెల్లడించింది. రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లు పిటిషన్ దారుడికి చెల్లించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీరా రాజా వీరా” పాట తన తండ్రి ఫయాజుదీన్ డగర్ మరియు మామ జాహిరుదీన్ డగర్ రాసిన ‘శివ స్తుతి’ నుంచి  రూపొందించారని, తమ అనుమతి లేకుండా సంగీతాన్ని వినియోగించారని ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు సాధించిన రెహమాన్‌కు కాపీరైట్ ఇష్యూలో ఫైన్ పడడం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. పొన్నియిన్ సెల్వన్ సినిమా విషయానికి వస్తే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కింది. కోలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సైతం కొల్లగట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష, రవి మోహన్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ రెండు పార్టులకు కూడా ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!