Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీపహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలెర్ట్

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలెర్ట్

విజయనగరం జిల్లాలో ఉన్న పాకిస్థానీ జాతీయులు ఈ నెల 27 లోగా స్వదేశానికి వెళ్లాలి

సాధారణ వీసాపై వొచ్చిన వారు 27 లోగా, వైద్య వీసా పై వొచ్చిన వారు 29 లోగా తిరిగి వెళ్లాలి

– విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్

జయజయహే: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించిన నేపధ్యంలో భాగంగా దేశంలో ఉన్న పాకిస్థానీ లు ఏప్రియల్ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని నిర్ణయిం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలియచేసారు. కేంద్ర ప్రభుత్వ హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అమలు చేయాడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న పాకిస్థానీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీలకు ఇచ్చిన వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో సాధారణ వీసాలపై వచ్చిన పాకిస్థానీలు ఏప్రియల్ 27 కల్లా, వైద్య వీసాలపై వచ్చినవారు ఏప్రియల్ 29 కల్లా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ నెల 30 తర్వాత అట్టారీ సరిహద్దును మూసివేస్తున్న దృష్ట్యా జిల్లాలో పాకిస్థాన్ వీసాపై వొచ్చిన వారిని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లను ఆదేశించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ తెలియ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?