ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఎక్సైజ్ దాడులు

ఎక్సైజ్ దాడులు

📰 Generate e-Paper Clip

4600 లీటర్ల బెల్లం ఊట , 40 లీటర్ల నాటు సారా ధ్వంసం

అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.సుర్జిత్ సింగ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి.రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్ జిల్లా సరిహద్దు గ్రామాలైన పాడేరు మండలం వంట్లమామిడి మరియు చోడిపల్లి గ్రామ శివార్లలో కొండప్రాంతంలో నాటు సారా బట్టీలపై దాడులు చేసి నాటు సారా తయారు చేయుటకు సిద్ధంగా ఉన్న 4600 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల నాటు సారా ధ్వంసం చేసినట్టు మాడుగుల ఎక్సైజ్ ఉపేంద్ర తెలిపారు.

నాటు సారా తయారీ దారులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎల్.ఉపేంద్ర, టి.వెంకటప్పల నాయుడు, ఎన్.శ్రీనివాసరావు ఎస్సైలు యస్.చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!