ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసేవా రహదారిపై అనవసర బారికేడ్లు.. ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు.. ప్రశ్నించిన కార్పొరేటర్ తో నేవల్...

సేవా రహదారిపై అనవసర బారికేడ్లు.. ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు.. ప్రశ్నించిన కార్పొరేటర్ తో నేవల్ అధికారులు వాగ్వాదం…

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే : విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం కళ్యాణి హాస్పిటల్ వద్ద గల సేవా రహదారిపై నేవల్ అధికారులు అనధికారికంగా సుమారు ఆసుపత్రికి 500 మీటర్లు పొడవున బారికేడ్లు అమర్చడంతో అక్కడ రహదారి కుదించుకుపోయింది. దీంతో అటువైపు రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం స్థానిక (40వ వార్డు) కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై అటు వెళ్తుండగా కళ్యాణి ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి ఆసుపత్రి వద్ద తమ బంధువులు కనిపించడంతో తన ద్విచక్ర వాహనంపైనే ఉండి వారితో మాట్లాడుతుండగా అక్కడికి నేవల్ అధికారులు వచ్చి కార్పొరేటర్ జీఎన్నార్ తో దురుసుగా ప్రవర్తించారు. దీనిపై సదరు కార్పొరేటర్ విలేకర్లతో మాట్లాడుతూ ఈ రహదారి జీవీఎంసీకి సంబంధించిందని ఈ రహదారిపై అనధికారికంగా ఎటువంటి బారికేడ్లు పెట్టరాదని ఈ విషయాన్ని జోనల్ కమీషనర్ తో పాటు జీవీఎంసీ ఇన్ ఛార్జ్ కమీషనర్ జిల్లా కలెక్టర్ హరీంధ్ర ప్రసాద్ దృష్టికి తీసుకొని వెళ్ళనున్నట్లు తెలిపారు.

                         

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!