ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీటీచర్ ని చెప్పుతో కోట్టిన విద్యార్థిని రఘు కళాశాలలో టీచర్ కి విద్యార్థిని కి...

టీచర్ ని చెప్పుతో కోట్టిన విద్యార్థిని రఘు కళాశాలలో టీచర్ కి విద్యార్థిని కి మధ్య వాగ్వాదం

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం : జయజయహే : విద్య లేని వారు వింత పశువులు అనే సామెత ఒకప్పటి సామెత నేటి తరానికి చదువుకున్నవారు వింత పశువులు అనే తీరుగా ఉంది నేటి యువతరం. తల్లిదండ్రులన్న,పెద్దలన్న ఆఖరికి విద్య బుద్దులు చెప్పే గురువులన్న భయం భక్తి లేకుండాపోయాయి. విశాఖపట్నంలో రఘు కళాశాలో టీచర్ ని చెప్పుతో సంఘటన విద్యావంతులను, మేధావులను ఆశ్చర్యానికి గురిచేసింది.చదువు తో పాటు సంస్కారం కొంతైన ఉండాలి అనే ఇంకిత జ్ఞానం లేకుండా నేటి విద్యార్థులు తయారవుతున్నారు. కాలేజిలో మొబైల్ ఫోన్ వాడొద్దు అని టీచర్ హెచ్చిరించి విదార్థినుండి ఫోన్ ని ఆమె దగ్గర పెట్టుకున్నారు.విద్యార్థి టీచర్ అని మరిచిపోయి ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టాల అనే నీచ పదాలు వాడి అన్నంత పని చేసింది టీచర్ ని టప టప మని చెప్పుతో కొట్టింది.ఇలాంటి సంఘటన కొన్నిరోజుల క్రితం జరిగింది కొట్టలేము తిట్టలేము అని ఉపాద్యాయుడు తనకు తానె శిక్షవేసుకున్నాడు మీకు మంచి విద్య,బుద్దులు నేర్పలేకపోతున్నామని ఆవేదన చెందాడు ఆ సంఘటన మరవక ముందే టీచర్ ని చెప్పుతో కొట్టే సంఘటన చూడాల్సి వచ్చింది.విద్యార్థులు మానసిక రోగులగా తయారుకావడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే.నేటి యువకులు మరి చిన్న వయసులోనే మద్యానికి బానిస కావడం, మత్తులో నేరాలు చేయడం జరుగుతుంది. జారుతున్న పరిణామాలకు భాద్యత ఎవరాన్నిది ప్రస్నార్ధకామ్ ల మారింది ..

             

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!