ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీతలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు

తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు

📰 Generate e-Paper Clip

అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు

జయజయహే : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ అమ్మవారిని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గంలో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మ దంపతులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ సిబ్బంది ఘన స్వాగతం. ఆలయ అర్చకులు గర్భాలయంలో విశేష పూజలు నిర్వహించి, మండపంలో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదములు అందజేశారు.ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ అమ్మవారిని నమ్ముకున్నవారికి ఎలాంటి తలంపులు ఉండవని అన్నారు. కార్యక్రమంలో దువ్వి గోవింద్ గారి కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!