సేవా రహదారిపై అనవసర బారికేడ్లు.. ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు.. ప్రశ్నించిన కార్పొరేటర్ తో నేవల్ అధికారులు వాగ్వాదం…

విశాఖపట్నం : జయజయహే : విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం కళ్యాణి హాస్పిటల్ వద్ద గల సేవా రహదారిపై నేవల్ అధికారులు అనధికారికంగా సుమారు ఆసుపత్రికి 500 మీటర్లు పొడవున బారికేడ్లు అమర్చడంతో అక్కడ రహదారి కుదించుకుపోయింది. దీంతో అటువైపు రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం స్థానిక (40వ వార్డు) కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై అటు వెళ్తుండగా కళ్యాణి ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి ఆసుపత్రి వద్ద తమ బంధువులు కనిపించడంతో...