విశాఖపట్నం : జయజయహే : జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి మాట్లాడుతూ రోజా కోసం మాట్లాడాలి అంటే సిగ్గు పడుతున్నాం. మనుషుల్లో మూడు జాతులు ఉంటాయి..రోజా నాల్గో జాతి కి చెందిన వ్యక్తి అని బోలిశెట్టి సత్య అన్నారు. వైసిపి నేత రోజా సినిమా టికెట్ అమ్మినట్టు, టిటిడి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి.రోజా మంత్రి గా ఉండి ఒక్క మంచి పని చేయలేదు.టిటిడి, టిక్కెట్లు వ్యాపారం లేక, డబ్బులు లేక ఏదేదో మాట్లాడుతున్నారు.కరుణాకర రెడ్డి ఆగమ శాస్త్ర నిబంధనలు విరుద్దంగా ప్రవర్తించారు. రోజా తీరు సభ్య సమాజం సిగ్గుతో తలా దించుకునేలా ప్రవర్తించారు అని బోలిశెట్టి సత్య మండిపడ్డారు .
జనసేన నేత,కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఒంటి మెట్ట ఆలయంలో కల్యాణ ఉత్సవాలు జరుగుతుంటే,వైసిపి మూకలు టిటిడి గోశాల విషయాంలో రాద్ధాంతం చేశారు. కాంగ్రెస్ లో రోజా అడుగు పెట్ట గానే… వైఎస్ మృతి చెందారు…రోజా ఐరన్ లెగ్… చిత్తూరు చిత్రాంగి రోజా. రోజా అంటే కంపు…ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన సుగంధ పరిమళ ఇంపుగా ఉందని జనసేన నేత,కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు . వైసిపి హయాంలో టి టి డి లో అన్యమత ప్రచారం చేశారు. ఆడుదాం ఆంధ్రా..లో రోజా కోట్లు దోచుకున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు చేసిన వ్యాఖ్యలు వాస్తవమా? కాదా? రోజా చెప్పాలి అని అన్నారు . రోజా…నువ్వు ఆ సినిమాల్లో నటించావా? లేదా? రోజా కి దమ్ము ఉంటే ఆ సినిమాల్లో తాను నటించలేదని వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయాలి. రోజాకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి లేదు అని అభిప్రాయపడ్డారు. విశాఖ వాళ్ళు అంటే అంత చులకనా. బీసీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు వైజాగోడు అని అవమానపరుస్తున్నారా. విశాఖ అంటే లోకువా. ఇదే విశాఖను రాష్ట్ర రాజధాని అని పేరు చెప్పి దోచేశారు. విశాఖ,ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా రోజా మాట్లాడారు..మాజీ మంత్రి రోజా డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ కు,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కు వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. లేదంటే ఇదే విశాఖ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్ట నివ్వం. విశాఖలో రోజా అడుగు పెట్టినపుడు… విశాఖ ప్రజలు తరిమి తరిమి కొడతారుకూడా. పవన్ కల్యాణ్,పల్లా శ్రీనివాసరావు పై రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, జనసేన నేత,కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు .

