ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపారిశ్రామిక భద్రతపై సమీక్ష సమావేశం – ప్రమాదాల నివారణకు కృషి

పారిశ్రామిక భద్రతపై సమీక్ష సమావేశం – ప్రమాదాల నివారణకు కృషి

📰 Generate e-Paper Clip

అనకాపల్లి జిల్లా : జయజయహే : పారిశ్రామిక ప్రాంతాల్లో ముఖ్యంగా పరవాడ,అచ్యుతాపురం మరియు రాంబిల్లిలో గల ఫార్మా కంపెనీల్లో జరిగే ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై ఈరోజు సమీక్ష సమావేశం పరవాడ ఎకోనో హోటల్‌లో నిర్వహించ బడింది. ఈ సమావేశంలో జిల్లాలోని 164 ఫార్మా మరియు ఇతర పరిశ్రమలకు చెందిన చైర్మన్లు,మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు,ప్లాంట్ నిర్వహణ అధికారులు,భద్రత అధికారులు,హెచ్.ఆర్.మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ అధ్యక్షత వహించారు పరిశ్రమల ప్రతినిధులు, భద్రతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశాని కి హాజరయ్యారు కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ గత ఘటనల నుండి పాఠాలు నేర్చుకొని భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికుల్లో అవగాహన పెంచేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించే వ్యవస్థలను అభివృద్ధి చేయాలి అని సూచించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ పరిశ్రమలు జిల్లాకు అభివృద్ధి,యువత కు ఉపాధి కల్పిస్తున్నాయి భద్రతా ప్రమాణాలను పాటించడం ప్రతి పరిశ్రమ యొక్క బాధ్యత. ప్రమాదాల సమయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకం” అని పేర్కొన్నారు . పరవాడ డిఎస్పీ విష్ణు స్వరూప్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన కొన్ని పారిశ్రామిక ప్రమాదాలను విశ్లేషించి వాటి కారణాలను వివరించి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తగు చర్యలు సూచించారు ఈ సమావేశం లో జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్ రెడ్డి, బాయిలర్ ఇన్స్పెక్టర్ కె.వీరభద్రరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ.ఈ. పి.వి.ముకుందరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆర్.వి.రమణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ వి.అభిప్రియ, లేబర్ డిపార్ట్‌మెంట్ ఇంచార్జ్ అధికారి శ్రీ కె.వసంతరావు, పరవాడ సబ్ డివిజన్ డిఎస్పీ వి.విష్ణు స్వరూప్, పరవాడ ఇన్స్పెక్టర్ ఆర్. మల్లికార్జున రావు, అచ్యుతాపురం ఇన్స్పెక్టర్ ఎన్.గణేష్, రాంబిల్లి ఇన్స్పెక్టర్ సి.హెచ్. నరసింహారావు, ఎస్సైలు కృష్ణారావు రామారావు మరియు మహాలక్ష్మి,పారిశ్రామిక భద్రతా అధికారులు, స్థానిక పోలీసులు, మరియు పరిశ్రమల సేఫ్టీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!