పారిశ్రామిక భద్రతపై సమీక్ష సమావేశం – ప్రమాదాల నివారణకు కృషి
అనకాపల్లి జిల్లా : జయజయహే : పారిశ్రామిక ప్రాంతాల్లో ముఖ్యంగా పరవాడ,అచ్యుతాపురం మరియు రాంబిల్లిలో గల ఫార్మా కంపెనీల్లో జరిగే ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై ఈరోజు సమీక్ష సమావేశం పరవాడ ఎకోనో హోటల్‌లో నిర్వహించ బడింది. ఈ సమావేశంలో జిల్లాలోని 164 ఫార్మా మరియు ఇతర పరిశ్రమలకు చెందిన చైర్మన్లు,మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు,ప్లాంట్ నిర్వహణ అధికారులు,భద్రత అధికారులు,హెచ్.ఆర్.మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ అధ్యక్షత వహించారు పరిశ్రమల ప్రతినిధులు,...