Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీగ్రామ సచివాలయాలు విలీనం *17 సచివాలయాలను తొమ్మిది సచివాలయాలుగా రేషనలైజేషన్ *సచివాలయ సేవలు ప్రజలకు...

గ్రామ సచివాలయాలు విలీనం *17 సచివాలయాలను తొమ్మిది సచివాలయాలుగా రేషనలైజేషన్ *సచివాలయ సేవలు ప్రజలకు మరింత చేసే దిశగా చర్యలు

మక్కువ ,(జయజయహే ) :- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా సచివాలయాల రేషనలైజేషన్ చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ మూడు ప్రకారం రాష్ట్రంలో సచివాలయాల రేషనలైజేషన్ పనులు దాదాపు పూర్తి కానున్నాయి . ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ మండలం లో కూడా సచివాలయాల రేషనలైజేషన్ పనులు అధికారులు దాదాపు చేపట్టారు . ఇందులో భాగంగా మండలంలో గల 17 గ్రామ సచివాలయాలు , జనాభా ప్రాతిపదికన రేషనలైజేషన్ చేపట్టి తొమ్మిది సచివాలయాలుగా రేషనలైజేషన్ అయ్యాయి. ఇందులో భాగంగా ఎనిమిది వేల , 781 మంది జనాభా కలిగిన మండల కేంద్రంమైన మక్కువలో ఇంత వరకు మక్కువ -1 , మక్కువ – 2 గ్రామ సచివాలయాలు ద్వారా ప్రజలకు సేవలు అందించేవారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన రేషనలైజేషన్ ద్వారా మక్కువ – 2 సచివాలయం , మక్కువ -1 సచివాలయములో రేషనలైజేషన్ చేశారు . అలాగే 18 వందల 76 మంది జనాభా కలిగిన మండలంలో చప్పబుచ్చంపేట గ్రామ సచివాలయాన్ని , రెండు వేల 875 జనాభా కలిగిన ఎ వెంకంపేట సచివాలయంలో రేషనలైజేషన్ చేశారు . 1819 మంది జనాభా కలిగి ఉన్న వెంకటభైరపురం గ్రామ సచివాలయాన్ని , నాలుగు వేల 415 మంది జనాభా కలిగి ఉన్న కాశీపట్నం గ్రామ సచివాలయం లో రేషనలైజేషన్ చేశారు . రెండు వేల 308 జనాభా కలిగి ఉన్న శీబిల్లిపెద్దవలస గ్రామ సచివాలయాన్ని , నాలుగు వేల 165 మంది జనాభా కలిగిన శంబర గ్రామ సచివాలయంలో రేషనలైజేషన్ చేశారు. రెండు వేల 20 మంది జనాభా కలిగి ఉన్న డి శిర్లాం గ్రామ సచివాలయాన్ని , రెండు వేల 323 మంది జనాభా కలిగి ఉన్న దబ్బగడ్డ గ్రామ సచివాలయంలో రేషనలైజేషన్ చేశారు . రెండు వేల 134 మంది జనాభా కలిగిన కోన గ్రామ సచివాలయాన్ని , రెండు వేల, 754 మంది జనాభా కలిగివున్న తూరుమామిడి గ్రామ సచివాలయంలో రేషనలైజేషన్ చేశారు . 17 వందల 55 మంది జనాభా కలిగి ఉన్న చెముడు గ్రామ సచివాలయాన్ని , మూడు వేల 148 మంది జనాభా కలిగి ఉన్న కవిరిపల్లి గ్రామ సచివాలయంలో రేషనలైజేషన్ చేశారు. రెండు వేల , 331 మంది జనాభా కలిగి ఉన్న సరాయివలస గ్రామ సచివాలయాన్ని , మూడు వేల 12 మంది జనాభా కలిగి ఉన్న మార్కుండ పుట్టి గ్రామ సచివాలయంలో రేషనలైజేషన్ చేశారు. నాలుగు వేల , 840 జనాభా కలిగి ఉన్న పనసభద్ర గ్రామపంచాయతీ లో గ్రామ సచివాలయం గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?