గ్రామ సచివాలయాలు విలీనం *17 సచివాలయాలను తొమ్మిది సచివాలయాలుగా రేషనలైజేషన్ *సచివాలయ సేవలు ప్రజలకు మరింత చేసే దిశగా చర్యలు
మక్కువ ,(జయజయహే ) :- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా సచివాలయాల రేషనలైజేషన్ చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ మూడు ప్రకారం రాష్ట్రంలో సచివాలయాల రేషనలైజేషన్ పనులు దాదాపు పూర్తి కానున్నాయి . ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ మండలం లో కూడా సచివాలయాల రేషనలైజేషన్ పనులు అధికారులు దాదాపు చేపట్టారు . ఇందులో భాగంగా మండలంలో గల 17 గ్రామ...