మాడుగుల జయజయహే : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం మండల విద్యాశాఖాధికారి బి దేవుడమ్మ ఆధ్వర్యం లో మాడుగుల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కు ఎక్సపోజర్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలలో వైజ్ఞానిక చైతన్యం,సామాజిక స్పృహ ,వినోదం వంటి విలువలు పెంపొందించే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఫైర్ ఇంజన్ పనిచేసే విధానం,విపత్తుల సమయం లో సిబ్బంది స్పందించే తీరు అగ్నిమాపక అధికారి వివరించారు.విపత్తుల సమయంలో ఉపయోగించే గ్యాస్,ఫోమ్ ,లైఫ్ బోట్ వంటి పరికరాలు విద్యార్థులకు చూపించి వాటి పని చేయు విధానం వివరించారు. అలాగే పసుపు ,మిరియాలు పంట,గ్రేడింగ్, ఉపయోగాలు వివరించారు.ముఖ్యంగా మాడుగుల హల్వా తయారి విధానం, తయారు చేసే వంటశాల సందర్శన ద్వారా వివరించారం ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి దేముడమ్మ, హెచ్ఎం శిరిపిల్లి సూర్యనారాయణ, ఉపాధ్యాయిని ఉమా, సిఆర్పి శారదా పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులకు ఎక్స్పోజర్ విజిట్
0
46
RELATED ARTICLES

