ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీదాట్ల సాహిత్య కృషి ప్రశంసనీయం ...

దాట్ల సాహిత్య కృషి ప్రశంసనీయం …

📰 Generate e-Paper Clip

కాజులూరు.జయ జయహే : స్థానిక ఎస్. డి. వి.ఆర్. ఆర్. ఏ. ఉన్నత పాఠశాల కొలంకలో రాష్ట్ర ప్రభుత్వంచే ‘కళారత్న’ పురస్కారం స్వీకరించిన ప్రసిద్ధ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజును పాలక వర్గం, గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ దంతులూరి అనంత వర్మ అధ్యక్షతన ఈ కార్యక్రమము ఘనంగా జరిగింది.కోలంక గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు పాఠశాల పూర్వ విద్యార్థి అయిన దాట్ల దేవదానం రాజు ప్రతిష్టాత్మక అవార్డు పొందినందుకు గర్వపడుతున్నామని తెలియజేశారు. డా. ఎస్ ఆర్ కే ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ డా. వరుగు భాస్కరరెడ్డి మాట్లాడుతూ రాజు వెలయించిన సాహిత్యం గురించి విపులంగా వివరించారు. కథ, కవిత్వం, చరిత్ర, యాత్రాకథనం వంటి వివిధ ప్రక్రియల్లో అద్భుతంగా రచనలు చేయడం ప్రశంసనీయమన్నారు. రీజెన్సీ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తాతపూడి ప్రసాదరావు పురస్కారం పొందిన రాజు ప్రతిభ కొనియాడదగినదని అభినందించారు. ఆంధ్రీకుటేరం సంచాలకులు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి అవార్డుగ్రహీత అధ్యయనశీలత, పట్టుదల, కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లిపూడి రంగారావు సమన్వయకర్తగా వ్యవహారించారు. సభలో వీరభద్రరాజు, సోమశంకరశర్మ, రామభద్రరాజు, కొండ్రాజు, చిట్టిబాబు, సత్యనారాయణ పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని దేవదానం రాజు కు అభినందనలు తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!