ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీ18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం

18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం

📰 Generate e-Paper Clip

శ్రీహరికోట: జయజయహే : ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్‌ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 18 (ఆదివారం)న శ్రీహరికోటలోని షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్‌ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్‌) రిశాట్‌-18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7.59 గంటలకు ఈ మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. నిరంతరాయంగా 22 గంటలపాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణన్‌ గురువారం షార్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. దేశ భద్రత, ప్రజల అవసరాలే ప్రధాన లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతుందని, ఇతర దేశాలతో పోటీ పడదని పేర్కొన్నారు…..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!