18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం

శ్రీహరికోట: జయజయహే : ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్‌ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 18 (ఆదివారం)న శ్రీహరికోటలోని షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్‌ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్‌) రిశాట్‌-18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7.59 గంటలకు ఈ మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. నిరంతరాయంగా 22 గంటలపాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్‌ నింగిలోకి...