ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవి. ఎం. ఆర్. డి. ఎ. కళ్యాణమండపం పునః ప్రారంభోత్సవం

వి. ఎం. ఆర్. డి. ఎ. కళ్యాణమండపం పునః ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

జయజయహే : సుమారు 40 లక్షల వ్యయంతో సెక్టార్ –1, ఎం వి పి కాలనీ (వెంకోజిపాలెం) ఉన్న వి. ఎం. ఆర్. డి. కళ్యాణమండపం మేయర్ పీలా శ్రీనివాసరావు , విశాఖ తూర్పు నియోజక వర్గం శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, వి. ఎం. ఆర్. డి. చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమీషనర్ కె. ఎస్ విశ్వనాథన్ ఎస్ ., చేతులమీదుగా నవీకరణ అనంతరము పునః ప్రారంభోత్సవం గావించబడినది. ఈ సందర్భంగా చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఇది పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే కళ్యాణ మండపం అని చాలా తక్కువ సమయంలో దీని నవీకరణకు సాంకేతిక విభాగం సమష్టిగా చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సత్యనారాయణ , జాయింట్ కమీషనర్ రమేష్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ప్రధాన గణాంకాధికారి హరిప్రసాద్, డి ఎఫ్ సుజాతా శివానీ, పర్యవేక్షక ఇంజనీర్ భవానీ శంకర్, కార్యనిర్వహక ఇంజినీర్లు రామరాజు, సుధీర్, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ శిరీష, సహాయక ఇంజనీర్ శర్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!